Wednesday 29 April 2015

ఈ దేశంలో భిన్నత్వం లో ఏకత్వం పోయి ఏకాకిత్వం ఉంది....ఈ ఫేస్ బుక్ వేదికగా మళ్ళీ మనలో ఏకత్వం రావాలి....వస్తుంది...వచ్చి తీరుతుంది ఈ దేశంలో భిన్నత్వం లో ఏకత్వం పోయి ఏకాకిత్వం ఉంది....ఈ ఫేస్ బుక్ వేదికగా మళ్ళీ మనలో ఏకత్వం రావాలి....వస్తుంది...వచ్చి తీరుతుంది ఏకత్వం రావచ్చు, కానీ ఎప్పుడొస్తుంది? ఎన్నేళ్ళకొస్తుంది? దేశమంతా ఎడారి అయిపోయినపుడా? దోపిడీదార్లు ప్రకృతివనరులను సర్వనాశనం చేసేసి భూమాతను చెరపట్టినపుడా? అందరూ ఉద్యోగాల మోజులో పడి సేవారంగాల్లో సెటిలవడానికి ముందుకొస్తుంటే వ్యవసాయం చేసేవారు కరువై, తిండిగింజలకు కొట్లాటలు జరిగి జనమంతా కొట్టుకుచచ్చాకా? ఎప్పుడొస్తుంది భిన్నత్వంలో ఐకమత్యం? ఇప్పటికే దురాశాపరుల ధాటికి పర్యావరణం ప్రమాదపు అంచుల్లోకి చేరింది. వివిధరకాల జీవజాతులకు నిలయమైన ఈ భూమ్మీద ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని ప్రమాదపు అంచుల్లో ఉన్నవి. అవికూడా ఎంతోకాలం బ్రతకలేవు. మనమే ఏదైనా చేసి అందరిలో(కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా) అవగాహన పెంచి చైతన్యం తీసుకురావాలి. ప్రకృతిని రక్షించుకొనే దిశగా జనాన్ని నడిపించాలి. అవినీతిని ప్రశ్నించే, ఎదిరించే విధంగా తయారుచేయాలి. నేను ఏమి చేయడానికైనా సిధ్ధం- ముందు నడవడానికైనా, అనుసరించడానికైనా! ఎంతమంది అలా వస్తారో చెప్పండి; అవినీతి భారతాన్ని అంతం చేద్దాం! నీతి భారతాన్ని నిర్మిద్దాం!!............ఈతరం యువతరం


No comments:

Post a Comment