Tuesday 28 April 2015

Etaram yuvataram organization


అనాథ

గోరుముద్దలు పెట్టలేదు,
చిట్టికథలూ చెప్పలేదూ..,

లాల పోయలేదు,
లాగు వేయలేదూ...

చెత్త బుట్టలో పడేశావు,
చేతులు దులుపుకున్నావు.

మాసిపోయిన పాతలూ,
మట్టి కొట్టుకున్న చేతులూ.

అంతటా... విదిలింపులూ,కదిలింపులూ,
ఇకిలింపులూ,సకిలింపులూ.

అమ్మ ఎలా ఉంటుందో చూడాలనీ,
ఎందుకు కన్నదో నిలదీయాలనీ.

ఎలాంటి దయనీయ స్థితి ఈ పనికి పురికొల్పిందో?
ఎలాంటి కమనీయ స్థితి నాకు ఊపిరి పోసిందో?

ఎదురుచూసినా...పారవేసిన అమ్మ రాదు,
ఎంత ఏడ్చినా....చేరదీసే అమ్మే లేదు.

జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....



No comments:

Post a Comment