వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం......ఈతరం యువతరం Organisation
నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన హైదరాబాద్లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
...................పోలీస్ కొలువుకోసం కలలుగని..............
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెర్వుకు చెందిన సిద్ధయ్య కుటుంబం ఇరవై ఏళ్ల క్రితమే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. అక్కడే పదోతరగతి చదివిన సిద్ధయ్య వెంటనే పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించినా వయసు చాలలేదు. తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇంటర్, డిగ్రీ చదువుతూనే శిక్షణ తీసుకున్నారు. 2012 బ్యాచ్ ఎస్సైగా ఎంపికై నల్గొండ జిల్లా మోత్కూరులో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆత్మకూర్ (ఎం) ఎస్సైగా పనిచేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామేశ్వరానికి చెందిన ధరణీషతో గతేడాది వివాహమైంది. తన భార్య గర్భిణి అని, ప్రసవసమయం దగ్గరపడినందున ఇంటికి వెళతానని సిద్ధయ్య ఉన్నతాధికారులను కోరాడు. అయితే సూర్యాపేట ఎన్కౌంటర్ నేపథ్యంలో సెలవు దొరకలేదు.

No comments:
Post a Comment