Tuesday 12 May 2015

మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు


No comments:

Post a Comment