Monday 26 October 2015

''ఈతరం యువతరం ఫౌండేషన్ '' ఈ వీడియో ను share చేయ్యండి ,అనాధపిల్లలకు సహయమ చేయ్యండి. అనాధ పిల్లలకు అండ గా ఈతరం యువతరం తల్లి దండ్రులను పోగొట్టుకొని ఆదరించే దిక్కులేక గాలికి, ధూళికి తిరిగే పిల్లలెందరినో మనం చూస్తున్నాం. మట్టిలో మాణిక్యలాంటి అనాధ పిల్లలు అదరణ లభించక అమూల్యమైన బాల్యాన్ని వెట్టిచాకిరికి ఉపయోగిస్తున్నారు. వీరిని అదరించి, అన్నంపెట్టి చదివిస్తే మంచి జీవితం వారికి దక్కుతుంది. ప్రేమ, భధ్రతలతో అనాధ, పేద పిల్లలకు అశ్రయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నిత్య జీవితంలో వివిధ వ్యాపకాలతో తీరిక లేకుండా ఉంటున్న మనం సమాజ అభివృధికి కొంతైనా కృషి చేయవలసిన సమయం ఆసన్నమయినది. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను". అన్న శ్రీ శ్రీ వాక్కును దృష్టిలో ఉంచుకొని మన సమయాన్ని, ధనాన్ని కొంతైనా పేద పిల్లల కోసం కేటాయిద్దాం. ఈ విధంగా చేయటం పరోక్షంగా దేశాభివృద్దికి దోహాదం చేసినట్లే. "ప్రార్దించే పెదలకన్న సహయo చేసే చేతులు మిన్న" అనే ధ్యేయంతో సూర్యాపేట లో ఈతరం యువతరం ఫౌండేషన్ 2015 లో ప్రారంభమైనది. ఈ సంస్ధ ద్వారా కొంత మంది పిల్లలకు సహయo చేస్తున్నారు. ''అనాధపిల్లలకు సహాయం చేద్దాం అనాధలు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం'' సంపత్ నాయుడు









No comments:

Post a Comment