Tuesday 12 January 2016

ఎవరో ఆ మర్రిచెట్టు చీకటిలో అర్దరాత్రి ఏదో మాట్లాడుతూ నేను వెనుకగా వెలుతున్న చూడకుండా అదేపనిగా అరుస్తున్నారు .. చాలి చాలని ధైర్యంతో నేను ఇంకా అటువైపుగా అడుగులేసాను. అక్కడ ఓ ఆకారం మనిషిలా మాట్లాడుతుంది.. నాకు ఏదో తెలియని భయం మొదలైంది.. అయినా తరువాతి క్షణాన్ని ఆలోచించకుండా తనను పిలిచేక్రమంలో తన బుజంపై చెయ్యి వేసాను.. ఆ ఆకృతి అంతమైపోయింది.. లేచి చూసా.. ఇదంతా కల .. తలుపు తీసి బయటికొచ్చా ముందు ఓ పురాతన కోట ఉంటుండేది. దాని తలుపులు తెరిచి ఉండడం నేను ఇదే మొదటిసారిగా చూస్తూ అలాగే ఉండిపోయా.. మరికొద్ది క్షణాల్లో దాని నుండి తెల్లని దుస్తులతో వచ్చింది ఓ సుందరి.. ఆ కాంతికి కళ్ళు మూసుకుపోతున్నాయి కాని పట్టు వదలని ఆలోచన అలాగే చూసేలా చేసింది.. అలా నడుస్తూ కోటలోకి వెల్లగానే ఆ తలుపులు మూసివేయబడ్డాయి... ఇదంతా నిజమే కాని ఆ రాత్రి నమ్మలేకపోయాను. ఉదయాన్నే యదావిదాగా కాలేజికి బయలుదేరాను.. అదే అమ్మాయి. బస్టాండు నుండి అలా నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరంలో ఉన్న బస్సు ఎక్కింది. నేను చూస్తుందంతా నిజమే అని తెలుసుకుని పరుగెత్తేలోపే ఆ బస్సు వెల్లిపోయింది.. ప్చ్ .. ఇపుడు ఏం చేయాలి ఫ్రెండ్స్?


No comments:

Post a Comment