Tuesday 12 January 2016

అమ్మ ..నన్ను మొదటగా ముద్దాడిన నీ పెదవులు ఎమవుతుందో చెప్పలేక ఏడస్తున్న నన్ను ఎలా అర్ధం చేసుకుని ఓదార్చాలో అని నువ్వు పడ్డ ఇక్కట్లు ... లోకాన్ని అర్ధం చేసుకోడానికి నువ్వు నేర్పిన మాటలు నన్ను నన్నుగా నిలబెట్టడానికి నువ్వు నేర్పిన నడకలు ... నన్ను అందరికన్నా ముందు ఉండమని నూరిపోసిన ఉగ్గుపాల ప్రోత్సాహాలు ...అందరితో ప్రేమించబడేలా నాకు నేర్పిన ఆత్మీయ ఆప్యాయతలు ...మనిషిగా నాకు ఉండాలని నువ్వు నేర్పిన సంస్కారం .. మానవత్వాలు . నాతో పాటు సహచర్యం చేసే మనుషుల పట్ల నా భాద్యతలు ఎన్ని ఎన్ని ఎలా నేర్పావ్ అమ్మ ....అమ్మ .... ఇవ్వన్ని ఏ ఉపాద్యాయుడు నేర్పుతాడు .. ఏ మత గురువు నేర్పుతాడు .. ఏ బోధకుడు నేర్పుతాడు ..?? అది అమ్మ గా నీకు మాత్రమే తెలిసిన విద్య శూన్యమైన నన్ను పూర్ణంగా మలచే శక్తి .. యుక్తి నీకు తప్ప ఎవరికుంది అమ్మ ?? . కన్న వారికోసం సుఖాలనే పట్టించుకోనంత త్యాగం ఎవరికుంది అమ్మ


No comments:

Post a Comment