Tuesday 12 January 2016

అమ్మ: తనలోని తన అజ్ఞాత స్వరూపానికి జన్మనిచ్చి తన రక్తముతో పోషించి గుండెల మీద జోకొట్టి ఆ రూపాన్ని జీవితాంతం ప్రేమిస్తుంది!!! లోకపు తాకిడికి ఎక్కడ కందిపోతుందోనని చల్లని వడిలో లాలింది. కంటికి రెప్పలా భావించి తన ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంది ఆ పసి ప్రాణాన్ని!! చీకటిలో వెలుగులా నిలిచింది. బోసి నవ్వులకు జతగా నవ్వింది. తానే ప్రధమ గురువై…. ప్రేమ అనే తొలి పదాన్ని నేర్పింది కాలం ఆగినా తను ఆగలేదు తన కర్తవ్యం చేయక మానలేదు ఎండనక వాననక గొడుగులా నిలిచింది. అన్నిబాధలను తనలోనే దాచుకుంది నీ విజయాన్నే ఆశిస్తుంది. నీ సంతోషాన్నే ప్రేమిస్తుంది నువ్వు చల్లగా ఉండాలని అన్ని వేళలా నిన్ను దీవిస్తుంది ఈ సృష్టి మలినమైన, కాలుష్యం నిండినా ఎన్ని మారినా, ఎంతటికి మారని అమృతమూర్తి ‘అమ్మ’.... for more like our Amma page plz


No comments:

Post a Comment