Wednesday 29 April 2015

!!లక్ష్యం ఉన్నతమైనదైతే, కష్టం నిన్ను బాధించదు, కొండ ఎక్కాలనే సంకల్పం- ఆయాసాన్ని లెక్కచేయదు , ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో-ఎదురయ్యే సవాళ్లే - పునాది రాళ్ళు!! ఓ మనసా.... చిన్న ఐడియా పూ రెక్కలని చిదిమి పూల దారులను పరచావు.... గుండెని ఆలయం చేసి తనకు హారతులిచ్చావు... ఎన్నెన్నో ఆశలతో కాలం ఒడిలోకి దూసుకుపోయావు.... తన కోసం ఆరాటపడి నిన్ను నువ్వు మరిచావు.... తను లేని లోకంలో ఒంటరిగా మిగిలిపోయావు... ఎన్నటికి ఆరేను నీ కంటతడి.... ఎప్పుడు తీరెను నీ హృదయపు అలజడి.... ఆరిన దీపపు చీకటిలో .... ముగబొఇన మౌనపు వాకిటిలో.. చెరిగిన కలల కల్లోలంలో.... వాడిన పూవులా, చేమ్మగిల్లావు.... ఓ మనసా.... ఒక్క సునామీతో సాగరం అంతరించిందా ... ఒక కొమ్మ విరిగిందని మహా వృక్షం దిగులు చెందిందా.... నీకు నువ్వే ఓదార్పు ,..... దైర్యం పెంచుకో ...స్థానం నిలుపుకో


No comments:

Post a Comment